మంథని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కుమార్
29-05-2026 12:27 PM
మంథని,మే29(విజయక్రాంతి): మంథని అడిషనల్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఆర్ధ కుమార్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతర్గాం మండలం రాయదండి గ్రామానికి చెందిన కుమార్ పరకాల అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఏపీపీగా పని చేస్తూన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా పరకాల నుంచి మంథని కోర్ట్ కు బదిలీ అయ్యారు. కుమార్ ను కోర్టు సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.






