30 March, 2026 | 1:50 AM

డ్రైవర్ వంటమనిషి మధ్య వాగ్వాదం

30-03-2026 12:08 AM
  1. డ్రైవర్‌పై కత్తితో దాడి చేసి హత్య చేసిన వంటమనిషి

కోకాపేట్‌లో హత్య

నిందితుడిని అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు

రాజేంద్ర నగర్ మార్చి 29 (విజయ క్రాంతి) : ఆహారం వడ్డించే విషయంలో జరిగిన తగాదా చివరకు ప్రాణం మీదకు తెచ్చిం ది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కోకాపేట్లోని నార్త్ స్టార్ అల్లూరా విల్లాస్లో నివసిస్తున్న కత్రగుంట ధర్మతేజా ఫిర్యాదు మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ విల్లాను ఆయన మేనమామ అద్దెకు తీసుకొని, కుటుంబ సభ్యులతో కలిసి గత నాలు గు నెలలుగా అక్కడ నివసిస్తున్నారు. అదే ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్న షేక్ బాషా సర్వెంట్ గదిలో ఉంటుండగా, సుమా రు 15 రోజుల క్రితం అతని ద్వారా పీనుమల్ల కార్తిక్ను డ్రైవర్గా నియమించారు.

మార్చి 28 రాత్రి సమయంలో ఇంట్లో ఫిర్యాదుదారు లేని సమయంలో, ఆహారం వడ్డించే విషయంలో షేక్ బాషా మరియు కార్తిక్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం ఘర్షణకు దారి తీసి, ఆగ్రహంతో షేక్ బాషా కత్తితో కార్త్పి పలుమార్లు దాడి చేశాడు. తీవ్ర గాయాలతో కార్తిక్ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు షేక్ బాషా (43)ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుడిని న్యాయ స్థానంలో హాజరు పరచగా, కోర్టు అతడిని న్యాయ నిర్బంధానికి తరలించింది. ఈ ఘటనతో కోకాపేట్ ప్రాంతంలో కలకలం రేగిం ది. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి  ఎస్ హెచ్ ఓ హరికృష్ణ రెడ్డి తెలిపారు..