నేడే క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక
ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ చంద్రయ్య
రామకృష్ణాపూర్, ఏప్రిల్ 3 : జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఎన్నిక పలు రాజకీయ కారణాల నేపథ్యంలో వాయిద పడగా తిరిగి ఈ నెల నాలుగవ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎన్నుకోనున్నారు. 18 వార్డులకుగాను బీఆర్‌ఎస్ పది, కాంగ్రెస్ ఏడు, సీపీఐ నాలుగు, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించారు.
బీఆర్‌ఎస్, సీపీఐ పొత్తులో 14 మంది గెలిచినప్పటికి రెండు సార్లు చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎంపికను అధికారులు వాయిదా వేశారు. శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు మనోజ్ తో కలిసి క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించి బి-ఫామ్ జారీకి సంబంధించి ఫామ్-ఎ (అధికార ప్రతినిధి అధికరణ పత్రాలు)ను స్వీకరించారు.
ఎన్నికల హాల్ను పరిశీ లించి, బారికేడింగ్, భద్రతా ఏర్పాట్లు, సదుపాయాలను తనిఖీ చేసి ఎ.సి.పి. , ఎస్.ఐ. లతో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ప్రత్యక్ష ప్రసారం ఏర్పాట్లు చేయాలని, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయా లని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి అన్ని చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు.




