18 July, 2026 | 11:05 AM

ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌కు ‘గోల్డెన్ పికాక్’ పురస్కారం

02-07-2024 12:33 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (విజయక్రాంతి): అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎంఆర్‌హెచ్‌ఎల్) ‘గోల్డెన్ పికాక్’ పురస్కారాన్ని దక్కించుకున్నది. ఈ మేరకు సంస్థ గత నెలలో ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ సర్టిఫికెట్ అందుకున్నది. అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటించడం, పని ప్రదేశంలో ఆరోగ్యకరమైన పరిస్థితులు అమలవుతుండటంతో సంస్థ ఈ పురస్కారానికి ఎంపికైంది. ఈ సందర్భంగా సోమవారం ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ కేవీబీరెడ్డి  నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.