18 July, 2026 | 11:24 AM

జనగామకు వన్నె తెచ్చిన సమ్మయ్య

02-07-2024 12:31 AM
  • చిందు కళారంగానికి ఆయన సేవలు భేష్

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

జనగామ, జూలై 1 (విజయక్రాంతి): చిందుయక్షగాన కళారంగంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య జనగామ జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలిపారని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఝాన్సీరెడ్డి కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్న గడ్డం సమ్మయ్యను ఆయన స్వగ్రామం దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లిలో సోమవారం సాయంత్రం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిందుయక్షగానంతో సమ్మయ్య అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రదర్శనలు ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ, జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.