1 March, 2026 | 3:15 AM

లేబర్ కార్డు రిజిస్ట్రేషన్, హెల్త్ చెకప్

28-02-2026 07:42 PM

లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులే 

నిర్వాహకులు చరణ్

చర్ల,(విజయక్రాంతి): చర్ల మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో భవన నిర్మాణ ఇతర అసంఘటిత రంగ కార్మికులు సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండేందుకు కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్మిక శాఖ ఆధ్వర్యంలో లేబర్ కార్డు ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులకు ఫ్రీ మెడికల్ టెస్ట్ హెల్త్ కార్డు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని  శనివారం చర్ల మేజర్ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు.

ఇందులో భాగంగా కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్సి) హెల్త్ కేర్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డు కలిగిన నిర్మాణరంగ కార్మికులకు శిబిరాలు ఏర్పాటు చేసి 50 రకాల పరీక్షలు ఉచితంగా అందిస్తుంది లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని వ్యాధులు నిర్ధారణ అయితే సంబంధిత ఆసుపత్రులకు సిఫార్సు చేస్తామని  తెలిపారు. 

పదివేల వరకు ఖర్చు అయ్యే 50 రకాల టెస్టులను తెలంగాణ ప్రభుత్వం లేబర్ కార్డు కలిగిన వారికి ఉచితంగా అందిస్తుంది అందులో స్పెషల్ డ్రైవ్  చేపట్టి  వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది.  భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు  ద్వారా జారీ చేయబడిన లేబర్ కార్డు  ఉన్నవారికివారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉచిత ఆరోగ్య పరీక్షలువైద్య చికిత్స (హెల్త్ చెకప్), కార్డు రెన్యువల్ సదుపాయం అందుబాటులో ఉంది.

సుమారు ₹10,000 విలువైన 50 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారని,  ఈసీజీ బిపి ఊపిరితిత్తులు కంటిచూపు చెవి ముక్కు గొంతు రక్తం మూత్రం షుగర్ వంటి పరీక్షలు నిర్వహిస్తారని, లేబర్ కార్డు రిజిస్ట్రేషన్ మరియు హెల్త్ చెకప్ క్యాంపుల కోసం మీ సమీపంలోని  చర్ల మేజర్ గ్రామపంచాయతీ  ఆఫీసులో  సంప్రదించగలరని నిర్వాహకులు చరణ్ తెలిపారు