లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి
సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ..
పెన్ పహాడ్: పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ(CITU District Committee Member Ranapanga Krishna) అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో మధ్యాహ్న భోజన కార్మికులతో కలసి జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయడం కోసం ముందస్తుగా మండల విద్యాధికారి నకరికంటి రవికి సమ్మె నోటీసును అందజేశారు.
ఈ సందర్బంగా కృష్ణ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించి, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. బారిసత్వంలోకి నెట్టే 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, వంట కార్మికులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని అనేక సమస్యలతో జులై 9న జరగబోయే సార్వత్రిక సమ్మెను మధ్యాహ్నం భోజన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం మండల అధ్యక్షులు రాలు నీలకంఠం సరస్వతి, శ్రావణి, సరిత, రాజ్యం, లక్ష్మి,ప్రమీల, గోవిందమ్మ, ఆదెమ్మ, వెంకటమ్మ, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.






