గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
24-02-2026 02:53 PM
అన్నపురెడ్డిపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో గల రాజాపురం గ్రామానికి చెందిన శనగరపు పుల్లయ్య (55) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం పనికి వెళ్లే క్రమంలో మార్గం మధ్యలో చాతి నొప్పి రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.




