కుమ్మెర ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి
ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాత విచారణ జరపాలి..
జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు
కందుకూరి రాజ్ కుమార్.
తాండూరు, ఫిబ్రవరి 24,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో అగ్రకులాల అహంకారంతో బీసీ రజక కుటుంబానికి చెందిన గణేష్–చంద్రకళ కుటుంబంపై జరిగిన అమానుష దాడి కారణంగా రెండు నెలల పసికందు మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనకు బాధ్యులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి, వారిపై హత్య కేసు కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి, కేసుకు సంబంధం ఉన్న వారందరిపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పక్షపాత విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.




