calender_icon.png 19 October, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిన్నింగ్ ఫ్యాక్టరీలను పరిశీలించిన అధికారులు

18-10-2025 05:57:30 PM

బోథ్ (విజయక్రాంతి): బోథ్ నియోజకవర్గ కేంద్రంలో త్వరలో చేపట్టనున్న పత్తి కొనుగోళ్ల కొరకు కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం తహసిల్దార్ సుభాష్ చంద్ర, మండల వ్యవసాయ అధికారి రవితేజ, మార్కెట్ సెక్రటరీ విట్టల్ లు పత్తి కొనుగోళ్లకు అనుకూలంగా ఉన్న బోథ్ లోని పలు ప్రైవేటు జిన్నింగ్ ఫ్యాక్టరీలను పరిశీలించారు. స్వప్న జిన్నింగ్, రాఘవేంద్ర జిన్నింగ్, సాయి దత్త జిన్నింగ్ ఫ్యాక్టరీలను వాటిలో గల సౌకర్యాలపై ఆరా తీశారు. త్వరలో చేపట్టబోయే పత్తి కొనుగోళ్ల సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంబంధిత యాజమాన్యాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా జన్నింగ్ ఫ్యాక్టరీల యజమానులు రైతులు పాల్గొన్నారు.