15 August, 2026 | 1:40 AM

ఈ రహదారికి మోక్షం ఎప్పుడో!

15-08-2026 12:37 AM

రోడ్డు లేక బడీడు విద్యార్థులకు తీవ్ర ఆటంకాలు

తూప్రాన్, ఆగస్ట్ 14: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో గల పదో వార్డు వెంకటాపూర్ పిటి గ్రామం నుండి మధిర నర్సాపురం గ్రామం వరకు ప్రధానమంత్రి సడక్ రోడ్డు మంజూరు, దారివెంబడి కరెంటు స్తంభాలు మంజూరు చేయగలరని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు గ్రామస్తులు గత నెలక్రింద రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

దానిపై నేటికీ స్పందన లేకపోవడంతో గ్రామస్తులు బాధను వ్యక్తం చేశారు. వెంకటాపూర్ గ్రామస్తులు ఆవేదనతో మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు మా గ్రామానికి రోడ్డు, కరెంటు స్తంభాలు, మంజూరు కాకపోవడం మా దురదృష్టకరం ఈ విషయం మెదక్ ఎంపీ దృష్టికి తీసుకు వెళ్లిన నేటి వరకు స్పందన లేకపోవడం పనులు జరగకపోవడం శోచనీయమన్నారు. వెంకటాపూర్ పిటి నుండి మధిర నర్సాపురం వరకు మా రెండు గ్రామాల మధ్య రోడ్డు అద్వానంగా ఉన్నదని కల్వర్టు లేక, కనీసం మట్టి కంకర రోడ్డు లేక వర్షాకాలంలో స్కూలుకు వెళ్లే బడీడు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బురుదలో నడుచుకుంటూ ఆపసోపాలు, నానాతంటాలు పడుతున్నారు.

వర్షానికి రోడ్డు కోతకు గురై స్కూల్ విద్యార్థులకు రైతులకు రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని వారి బాధను పలుమార్లు వ్యక్తం చేసిన నేటికీ రోడ్డు పనులు జరగకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ రెండు గ్రామాల మధ్య చీకట్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పాటు భయాందోళనతో వెళ్లడం జరుగుతుందని అధికారులకే గాని, రాజకీయ నాయకులకే గాని మా గోస కనబడత లేదా...అన్ని రాజకీయ ప్రభుత్వలు అభివృద్ధి చేశామని ప్రగల్బాలు పలకడమే తప్ప కార్యరూపం దాల్చడం లేదని అన్నారు. ఇకనైనా విద్యార్థుల గోస, రైతుల బాధ, ప్రయాణికుల వెదను గమనించి తక్షణమే రోడ్డు పనులను కొనసాగించాలని గ్రామస్తులు అన్నారు.