15 August, 2026 | 3:42 AM

అఖిల్ రాజ్, నాగదుర్గ జోడీగా శనార్తి

15-08-2026 01:30 AM

బ్లాక్‌బస్టర్ దర్శకుడు సంపత్ నంది తన సొంత నిర్మాణ సంస్థ సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్‌లో రెండో చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ నిర్మాత కేవీ శ్రీధర్‌రెడ్డితో కలిసి నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఆదిత్య మూవీస్ బ్యానర్ సమర్పిస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అఖిల్ రాజ్, యంగ్ హీరోయిన్ నాగదుర్గ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సంపత్ నంది శిష్యుడైన రాజ్ గణేశ్ ఉప్పునూతి ఈ ప్రాజెక్టుతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి ‘శనార్తి’ అనే టైటిల్ పెట్టారు. ఇది తెలంగాణలో సాంప్రదాయకంగా పలకరించడానికి ఉపయోగించే పదం. దీనికి ‘ఏ టేల్ ఆఫ్ కల్చర్’ అనేది ట్యాగ్‌లైన్. తన విలక్షణమైన సంగీతంతో ప్రశంసలు పొందిన సురేశ్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నా రు. ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.