20-02-2026 12:00:00 AM
గజ్వేల్, ఫిబ్రవరి 19: గజ్వేల్ నియోజకవర్గంలో అగ్నిమాపక అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అగ్ని ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల్లో, కళాశాలల్లో, ఇతర సంస్థల్లో ఆయా భవనాలకు తగ్గట్టుగా అగ్నిమాపక ఏర్పాట్లను చేసుకోవాల్సి ఉం టుంది. భవనాల, సంస్థల స్థాయిని బట్టి కా ర్యాలయాల్లో గడువు ముగిసిన ఫైర్ ఎక్సటింగిషర్స్ (CO2 పౌడర్ సిలిండర్లను) అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంటుంది.
ప్రతి సంవత్సరం సిలిండర్లోని కార్బన్డయాక్సైడ్ పౌడర్ ను మార్చాల్సి ఉంటుంది. కానీ గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ ( ఐఓసి)లో ఉన్న సిలిండర్లు 2019 సంవత్సరం నుండి ఇప్పటివరకు మార్చకపోవడం గమనార్హం. అగ్నిమాపక చర్యలను ఆయా కార్యాలయాలు సంస్థలు చేపడుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఎప్పటిక ప్పుడు పర్యవేక్షించాల్సిన అగ్నిమాపక శాఖ అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లోనే సరై న స్థాయిలో పర్యవేక్షించకపోతే ఇక ప్రైవేటు సంస్థల్లో ఏవిధంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.
ఇలాంటి స్థితిలో అనుకోకుండా ఏవైనా అగ్ని ప్రమాదాలు జరిగితే అగ్నిమాపక చర్యలు అందుబాటులో లేకపోవడంతో ఎంతో ప్రాణ ఆస్తి నష్టం జరిగే వర కు చూస్తూ ఉండాల్సి వస్తుంది. అలాగే గజ్వే ల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ తో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్మిస్తున్న భవనా లు, బహుళ అంతస్తుల భవనాలలో అగ్నిమాపక చర్యల సంబంధించి ఎలాంటి ఏర్పా ట్లు లేకపోయినా వివిధ సంస్థల కార్యకలాపాలకు ఆయా శాఖలు అనుమతిలిస్తున్నా యి.
అగ్నిమాపక అధికారులు ఎన్‌ఓసి ఇవ్వకుండానే ఆయా శాఖల అధికారులు అను మతి ఇస్తున్నారా అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక ఏర్పాట్లు లేని కళాశాలలు, పాఠశాలలు, ఇతర పారిశ్రామిక, వ్యాపార కేంద్రాల్లో, సంస్థల్లో ఏవైనా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే జరిగే ప్రాణ, అస్తి నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు. ఇప్పటికైనా అధికారులు అగ్నిమాపక ఏర్పాట్లపై సరైన పర్యవేక్షణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రతి సం వత్సరం సిలిండర్లను రీఫిల్ చేయాలి గజ్వేల్ ఫైర్ స్టేషన్ అధికారి శ్రీనివాస్ రెడ్డికార్యాలయాల్లో, ఇతర సంస్థల్లో ఏర్పాటుచేసిన ఫైర్ ఎక్సటింగిషర్స్ సిలిండర్లను గడువు ముగిసిన వెంటనే రీఫిల్ చేయాలి. ఫైర్ ఎక్స టింగిషర్స్ సిలిండర్ సంవత్సరానికి ఒకసారి రీఫిల్ చేయాల్సి ఉంటుంది. ఐదు సంవత్సరాలకు ఆ సిలిండర్ను మార్చి కొత్త సిలిండ ర్లను వినియోగించాల్సి ఉంటుంది.
ఐదంతస్తులకు పైగా ఉండే బౌలాంతస్తుల భవనాల లో అగ్నిమాపక చర్యలు పటిష్టంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతకు తక్కువగా ఉన్న భవనాల్లో అగ్నిమాపక శాఖ నిబంధనల మేర అవసరమైన సంఖ్యలో ఫైర్ ఎక్స టింగిషర్స్ సిలిండర్లను ఏర్పాటు చేసుకోవాలి.