16 May, 2026 | 2:30 AM

ఖమ్మం కార్పొరేషన్‌పై పర్యవేక్షణ కరువు

16-05-2026 01:45 AM

డివిజన్లలో పడకేసిన పారిశుద్ధ్యం

ఖమ్మం, మే 15(విజయక్రాంతి): ఖమ్మం కార్పొరేషన్ పై పర్యవేక్షణ కోరవడినట్లే కనిపిస్తోంది. శానిటేషన్ వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసారనిపిస్తోంది. లక్షల విలువ చేసే కార్పోరేషన్ వాహనాలు తుప్పుపట్ఠిపోతున్నాయి.. వాటిని పట్టించుకునే నాధుడే కరువైయ్యారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అన్ని డివిజన్ లలో పారిశుద్ధ్యం పడక వేసిందని, కార్పొరేషన్ లో ఉన్న వాహనాలు కూడా మరమ్మత్తుల్లో ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.  ఖమ్మం పట్టణంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కడికక్కడ పారిశుద్ధ లోపం స్పష్టంగా కనబడుతుందని ఆరోపిస్తున్నారు.

కార్మికుల శ్రమలు తగ్గించేందుకు పట్టణంలోని రోడ్లు శుభ్రంగా ఉంచే దిశగా లక్షలాది రూపాయలు పోసి కార్పొరేషన్ అధికారులు ఆధునిక నైపుణ్యం కలిగిన ‘స్వీపింగ్‘ వాహనాలను కొనుగోలు చేసినప్పటికీ, నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడ వదిలేయడంతో అవి రోడ్లమీద అలాగే దర్శనమిస్తున్నాయి.  కనీసం వాటిని మరమత్తులు చేయించి, నడిపించాల్సిన అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. బైపాస్ రోడ్ లో స్వీపింగ్ వాహనము వదిలేశారు. కొన్ని నెలలుగా అలాగే ఉండటంతో తుప్పు పట్టిపోతున్నాయి.

కావున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కమిషనర్ ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ఒక ప్రత్యేక సమావేశాన్ని అధికారులతో ఏర్పాటు చేసి వెంటనే డివిజన్ లలో పారిశుద్ధ్య లోపాలను సరి చేసి కార్పొరేషన్ అభివృద్ధి కోసం కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏయుఎంఎల్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా ఆరోపించారు.