15 April, 2026 | 8:21 AM

భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి

05-06-2025 12:00 AM

సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి

కొండపాక, జూన్ 4:  భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. బుధవారం కొండపాక మండలం , ఖమ్మం పల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ ప్రజల భూ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేస్తుందన్నారు.

ఈ నెల 20 వరకు రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయన్నారు.  ప్రజలు తమ భూ సమస్యలను దరఖాస్తు చేసుకోనీ రసీదు తీసుకోవాలని తెలిపారు. మర్పడగా నుంచి ఖమ్మం పల్లి గ్రామానికి వచ్చే బీటీ రోడ్డు  మరమ్మతు చేయాలని సూచించారు.

జిల్లాలోని పలు రిజర్వాయర్లు నుంచి ఖమ్మం పల్లి చెరువులోకి నీటిని విడుదల చేయాలని గ్రామస్తులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రకళ, తహసిల్దార్ సురేష్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.