15 July, 2026 | 1:22 AM

ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలుడు

24-06-2024 01:03 AM
  • ఇద్దరు కోబ్రా జవానుల మృతి

రాయ్‌పూర్, జూన్ 23: ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల వరుస ఎన్‌కౌంటర్లతో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులు ఎదురుదాడికి దిగారు. సుక్మా జిల్లాలో ఐఈడీ మందుపాతర పేల్చి ఇద్దరు సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్లను చంపివేశారు. రాష్ట్ర రాజధానికి 400 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవుల్లో సిల్గర్, టేకల్‌గూడెం ఉన్న తిమ్మపురం వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ దాడి జరిగింది.

201 యూనిట్‌కు చెందిన కోబ్రా బృందం జాగర్‌కుండా పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు క్లియరింగ్ విధులు నిర్వహిస్తుండగా నక్సల్స్ మందుపాతర పేల్చినట్టు అధికారులు తెలిపారు. జవాన్లు ట్రక్కు, మోటార్‌సైకిళ్లపై వెళ్తుండగా ట్రక్కును లక్ష్యంగా చేసుకొని మందుపాతర పేల్చారు. దీంతో అందులో ఉన్న కానిస్టేబుల్ శైలేంద్ర (29), ట్రక్కు డ్రైవర్ ఆర్ విష్ణు (35) మరణించారు.