calender_icon.png 7 February, 2026 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలి

07-02-2026 07:04:43 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): ఉపాధి హామీ పనులకు ఎక్కువ సంఖ్యలో కూలీలు హాజరుకావాలని  తాడువాయి మండల ఇన్చార్జి ఎంపీడీవో సవిత రెడ్డి(Taduvai In-charge MPDO Savitha Reddy) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామంలో శనివారం ఉపాధి హామీ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఉపాధి హామీ పనులను ఉపయోగించుకుని కూలీలు లబ్ధి పొందాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో కొలతల ప్రకారమే కూలీలకు డబ్బులు చెల్లించబడతాయన్నారు. కూలీలు ఇది గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సహాయకులు తదితరులు పాల్గొన్నారు.