13 April, 2026 | 6:39 PM

ప్రత్యేక ఎన్‌ఆర్‌ఐ డెస్కుల ప్రారంభం

25-12-2025 12:49 AM

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాంపల్లి, రైన్ బజార్ శాఖలలో ఏర్పాటు

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ పరిధిలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 23న నాంపల్లి, రైన్ బజార్ శాఖలలో ప్రత్యేక ఎన్‌ఆర్‌ఐ డెస్కులను ప్రారంభించింది. ఈ కార్య క్రమం లక్ష్యం ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) ఖాతాదారులకు ప్రత్యేకమైన, సమర్థ వంతమైన బ్యాంకింగ్ సేవలను అందించడం. ఎన్‌ఆర్‌ఐ డెస్కులను ధరాసింగ్ నాయక్ కె, జోనల్ హెడ్, హైదరాబాద్ జోన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా డి. కె. బరణ్వాల్, ప్రాంతీయ అధిపతి, హైదరాబాద్ ప్రాంతం, జోనల్ కార్యాలయ సీనియర్ అధికారులు, నాంపల్లి మరియు రైన్ బజార్ శాఖల శాఖాధిపతులు, బ్యాంకు సిబ్బంది  హాజరయ్యారు. కొత్తగా ప్రారంభించిన ఎన్‌ఆర్‌ఐ డెస్కులు ప్రవాస భారతీయ ఖాతాదారులకు ఒకే సంప్రదింపు కేంద్రంగా పనిచేస్తాయి. ధరాసింగ్ నాయక్ కె. ఖాతాదారులకు మెరుగైన సేవా అనుభవాన్ని అందించడంలో, ఎన్‌ఆర్‌ఐ వ్యాపార విస్తరణలో బ్యాంకు కట్టుబాటును వివరించారు.