calender_icon.png 25 December, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఇమిగ్రేషన్ ఫర్ ఎవ్రీ వన్’

25-12-2025 12:51:04 AM

మూడో ఎడిషన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన నరేష్ ఎం. గెహీ

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): అమెరికా ఇమిగ్రేషన్ ప్రక్రియపై సమగ్ర అవగాహన అందించే ‘ఇమిగ్రేషన్ ఫర్ ఎవ్రీవన్’ మూడో ఎడిషన్ పుస్తకాన్ని బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నటి అనన్య నాగళ్లతో కలిసి న్యూ యార్క్‌కు చెందిన గెహీ అండ్ అసోసియేట్స్ సంస్థ స్థాపకుడు, ప్రధాన న్యాయవాది నరే ష్ ఎం గెహీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా సినీ నిర్మాతలు గౌర్ కృష్ణ, టీ. గణపతిరెడ్డి, తేజ్ పల్లి, నటుడు ఆశి ష్ గాంధీ, నటి సహర్ కృష్ణన్ పాల్గొన్నారు.

‘ఇమిగ్రేషన్ ఫర్ ఎవ్రీవన్ మూడో ఎడిషన్’ పుస్తకం అమెరికా ఇమిగ్రేషన్ ప్రక్రియను సులభంగా అర్థమయ్యే విధంగా వివరిస్తూ, విద్యార్థులు, ప్రొఫెషనల్స్, కుటుంబాలు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులకు ఉపయోగపడేలా రూపొందించబడింది. నరేష్ ఎం. గెహీకి ఉన్న 20 ఏళ్లకు పైగా ఇమిగ్రేషన్ లా అనుభవాన్ని ఆధారంగా చేసుకుని, తా జా అమెరికా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు, పాలసీ మార్పులను ఇందులో సమగ్రంగా చేర్చారు.

నరేష్ ఎం. గెహీ మాట్లాడుతూ.. అమెరికా ఇమిగ్రేషన్ విదేశాలకు వెళ్లడమే కాదు. సరైన నిర్ణయాలు, చట్టపరమైన స్పష్టత, దీర్ఘకాలిక ప్రణాళిక అత్యం త అవసరం. ఈ పుస్తకం ద్వారా భారతీయులు స్పష్టత, నమ్మకం, చట్టపరమైన అ నుసరణతో ముందుకు సాగాల నే ఉద్దేశంతో దీనిని రచించానన్నారు.