calender_icon.png 25 December, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలు పోతున్నాయ్.. పట్టించుకోండి!

25-12-2025 12:47:05 AM

  1. కళ్ళముందే కాలుష్యం కనిపిస్తున్నా చర్యలు శూన్యం
  2. మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం 
  3. కేవీపీసీ ఆధ్వర్యంలో పశువులతో గ్రామస్తుల ర్యాలీ

గుమ్మడిదల, డిసెంబర్ 24 : కాలుష్యకారక పరిశ్రమతో ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోరా అం టూ బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న హెటీరో యూనిట్ - 1 పరిశ్ర మ కాలుష్యంపై దోమడుగు గ్రామ ప్రజలు చేపట్టిన పోరాటానికి ఆయన మద్దతు తెలిపారు.

గత కొన్ని నెలలుగా దోమడుగు గ్రా మ కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ (కెవిపిసి) ఆధ్వర్యంలో ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు. పరిశ్రమ కారణంగా నల్లకుంట చెరు వు పూర్తిగా కలుషితమైందని, భూగర్భ జలా లు విషపూరితమై పంటలు నష్టపోతున్నాయని, పశువులు మృతి చెందుతున్నాయని గ్రామస్తులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

బుధవారం కేవీపీసీ ఆధ్వర్యంలో దోమడుగు గ్రామ ప్రజలు పాడిపశువులతో కలిసి జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు హెటిరో పరిశ్రమకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేశారు.ఈ ర్యాలీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పా ల్గొని వారికి సంఘీభావం తెలిపారు

ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంబంధిత మంత్రి కొండా సురేఖ ప్రత్యేకంగా సం దర్శించి గ్రామస్తులకు న్యాయం కల్పించాలన్నారు కాలుష్యం కారణంగా ఏకంగా ఒక్క చెరువు పూర్తిగా కలుషితంగా మారిందని అన్నారు తద్వారా భూగర్భ జలాలు పాడిపంటలు నష్టపోతున్నాయని ప్రజలు అనా రోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

కళ్ళ ముందు కాలుష్యం కనిపిస్తున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా పరిశ్రమపై ఘాటైన చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్లు బాల్ రెడ్డి మంగ య్య జయమ్మ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు.