13-11-2025 12:00:00 AM
దుబాయి, నవంబర్ 12 : ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా దక్షిణాఫ్రికా మహిళల జట్టు కెప్టెన్ లారా వోల్వార్ట్ ఎంపికైంది. అక్టోబర్ నెలకు గానూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిలో ఆమె ఓటింగ్ ద్వారా అగ్రస్థానం సాధించి అవార్డును కైవసం చేసుకుంది. ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో లారా వోల్వార్డ్ పరుగుల వరద పారించింది. 8 మ్యాచ్‌లు ఆడి 470 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌పై సెమీఫైనల్లో భారీ సెంచరీతో తన జట్టును ఫైనల్‌కు చేర్చింది.
ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయినప్పటకీ సెంచరీతో ఒంటరి పోరాటం చేసిం ది. ఈ అవార్డు కోసం ఆమెతో పాటు భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, ఆసీస్ ఆల్‌రౌండర్ గార్డనర్ కూడా పోటీపడ్డారు. అయి తే ఓటింగ్‌లో లారా వోల్వార్డ్ విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఆమె 71 సగటుతో 571 రన్స్ చేసింది. అలాగే ప్రపంచకప్ సెమీస్‌లోనూ, ఫైనల్లోనూ సెంచరీలు చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. గతంలో ఈ ఫీట్ ఆసీస్ క్రికెటర్ అలీస్సా హీలీ సాధించింది.
కాగా స్మృతి కూడా ఈ మెగాటోర్నీలో అదరగొట్టింది. సఫారీ కెప్టెన్ తర్వాత 434 రన్స్‌తో సెకండ్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవా ర్డు రావడంపై సంతోషం వ్యక్తం చేసిన లారా వరల్డ్‌కప్ ఫైనల్లో ఓడినా తమ జట్టు పోరా టం చరిత్రలో నిలిచిపోయిందని కితాబిచ్చిం ది. మరోవైపు పురుషుల విభాగంలో నూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ సౌతాఫ్రికాకే దక్కింది. సఫారీ స్పిన్ ఆల్‌రౌండర్ ముత్తుసామి ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. అక్టో బర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అతను అద్భుతంగా రాణించాడు.