13-11-2025 12:00:00 AM
-ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
-దిగజారిన బాబర్ అజామ్ ప్లేస్
దుబాయి, నవంబర్ 12 : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్ల హవా కొనసాగుతోంది. తాజాగా విడుదలైన బ్యాటింగ్ జాబితాలో టాప్ ముగ్గురు టీమిండియా ప్లేయర్సే ఉన్నారు. రోహిత్ శర్మ అగ్ర స్థానాన్ని నిలబెట్టుకోగా..శుభమన్ గిల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టాప్‌న దూసుకొచ్చాడు. ఈ క్రమంలో పాక్ క్రికెటర్ బాబర్ అజామ్‌ను వెనక్కి నెట్టిన కోహ్లీ ఐదో ర్యాంకులో నిలిచాడు.
కెరీర్‌లోనే అత్యంత పేలవ ఫామ్‌లో ఉన్న బాబర్ అజామ్ రెం డు స్థానాలు దిగజారి ఏడో స్థానానికి పడిపోయాడు. అటు గా యంతో ఆటకు దూరమైన శ్రేయాస్ అ య్యర్ తొమ్మిదో ర్యాంకులో ఉండగా.. కేఎల్ రాహుల్ 17వ స్థానంలో నిలిచాడు. అటు బౌలింగ్ ర్యాం కింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ ఒక్కడే టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ ఆరో స్థానంలో ఉండగా..జడేజా 13, సిరాజ్ 15వ ర్యాంకులోనూ నిలిచారు. వన్డే ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్(8) ఒక్కడే టాప్ టెన్‌లో చోటు దక్కించుకోగా , ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.