13-11-2025 12:00:00 AM
-రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఆదేశం
-విజయ్ హజారే బరిలో రోహిత్
-ఇంకా స్పందించని కోహ్లీ
ముంబై, నవంబర్ 12 : 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ కీలక ఆదేశాలిచ్చింది. ఫామ్, ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు దేశవాళీ క్రికెట్ ఆడమని స్పష్టం చేసింది. అధికారికం గా దీనిపై స్పందించకున్నా రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ స్పష్టమైన సూ చన చేసినట్టు సమాచారం. దీనిపై రోహిత్ శర్మ కూడా స్పందించాడు.
బోర్డు ఆదేశాలకు రిప్లు ఇస్తూ తాను విజయ్ హజారే టోర్నీకి అందుబాటులో ఉంటానని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు సమాచారమిచ్చినట్టు తెలుస్తోంది. అటు కోహ్లీ మాత్రం ఇంకా స్పం దించలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం రోహిత్ సన్నద్ధమవుతుండగా... కోహ్లీ మాత్రం లండన్‌లో ఉన్నాడు. ఫ్యామిలీతో కలిసి లండన్‌కు షిప్ట్ అయిపోయిన విరాట్ ప్రస్తుతం మ్యాచ్‌లు ఉన్నప్పుడే భారత్‌కు వస్తున్నాడు.