calender_icon.png 15 February, 2026 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సులేమాన్‌నగర్‌లో అడ్వకేట్ హత్య

15-02-2026 12:00:00 AM

శంషాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ సులేమాన్ నగర్లో ఓ న్యాయవాది పట్టపగలే దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. చింతల్ మెట్ సులేమాన్ నగర్ లో నివాసం ఉండే న్యాయవాది మహమ్మద్ ఖదీర్ను మధ్యాహ్నం తన ఆఫీసులో వివిధ కేసులకు సంబంధించిన అంశాలపై నిమగ్నమయ్యాడు.

అదే సమయంలో ఇద్దరూ గుర్తుతెలియని దుండగులు న్యాయవాది ఆఫీసులోకి చొరబడి కత్తులతో దారుణంగా హత్య చేశారు. పలుమార్లు కత్తితో కడుపులో, ఎదపై గాయపరచడంతో ఖదీర్ అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచాడు. ఈ దాడి అనంతరం నిందితులు ఘటన స్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటనను చూసి న స్థానికులు వెం టనే పోలీసులకు సమాచారం అం దించారు.

ఈ సమాచారంతో వెం టనే సంఘటన స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు, క్లూస్ టీమ్‌తో ఘటన హత్యకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ విభే దాలతోనే సొంత బామ్మర్దులపై అనుమానం వ్యక్తమవుతోందని పోలీసులు తెలి పారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి నట్లు రాజేంద్రనగర్ ఎసిపి శ్రీనివాస్ తెలిపారు.