calender_icon.png 30 May, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తిలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

28-05-2025 07:39:57 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు(Thungathurthy Junior Civil Court)లో గత కొంతకాలంగా జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న బానోత్ ప్రతాప్ నాయక్ పై జరిగిన దాడికి నిరసనగా బుధవారం మండల కేంద్రంలోని సివిల్ కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నపర్తి జ్ఞాన సుందర్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. జరిగిన సంఘటనపై పోలీస్ శాఖ ఉన్నతాధికారుల విచారణ జరిపి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సివిల్ కోర్టు న్యాయవాదులు కారింగుల వెంకటేశ్వర్లు, జిల్లా కుమారస్వామి, జిలకర చంద్రమౌళి, గుగులోతు రాజారాం నాయక్, రవీందర్, వంగాల రాజు, వజీర్, ఫర్వీన్, బానోతు సతీష్, సైదులు, వంశీ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.