calender_icon.png 30 May, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి

28-05-2025 07:37:30 PM

అదనపు కలెక్టర్ రాంబాబు..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: మండల పరిధిలో యాసంగి సీజన్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని కాంటాలు వేసి వెంటనే మిల్లులకు తరలించి 2 రోజులలో కేంద్రాలను క్లోజ్ చేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు(Additional Collector Rambabu) కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. బుధవారం మండలంలోని జాజిరెడ్డిగూడెం, తిమ్మాపురం-1 ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతులను ఇబ్బంది పెట్టకుండా త్వరితగతిన ధాన్యం మిల్లులకు తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ చిప్పలపల్లి యాదగిరి, కేంద్రాల నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.