అదనపు కలెక్టర్‌ను కలిసిన తెలంగాణ ఎన్జీవోల సంఘం నాయకులు
కొత్తపల్లి, ఏప్రిల్ 25(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాకు ఇటీవల బదిలీపై విచ్చేసిన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. శ్రీనివాస్ రెడ్డిని ,తెలంగాణ ఎన్జీవోల సంఘం, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ దారం శ్రీనివాస్ రెడ్డి ఆద్వర్యంలో సంఘం నాయకులు మరియు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సంఘం తరఫున ఆయనకు పూల బొకే అందజేసి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. జిల్లా పరిపాలనలో ఆయన విశాల అనుభవం, పారదర్శక విధానం, ప్రజా సంక్షేమంపై కట్టుబాటు కరీంనగర్ జిల్లాకు ఎంతో మేలు చేకూర్చుతుందని సంఘం నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.
అలాగే జిల్లా అభివృద్ధి, రెవెన్యూ పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన సమర్థవంతమైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ, సంఘం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఉద్యోగులతో సమన్వయం కొనసాగిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టిఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్, డిఎస్ఓ నర్సింగ్రావు, రాష్ట్ర నాయకులు గూడ ప్రభాకర్ రెడ్డి ,రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మేందర్ సింగ్, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్, భరద్వాజ్ ,రూరల్ అధ్యక్షులు కోడూరి వాస్తవిక్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్, జిల్లా నాయకులు సునీత, అస్గర్ ,అలీ, సబిత, రమేష్ గౌడ్, కరుణాకర్, లవ కుమార్ ,నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






