15 March, 2026 | 7:48 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

కృష్ణ మందిర్ పీఠాధిపతిని పరామర్శించిన నాయకులు

18-05-2025 10:40 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో కృష్ణ మందిర్ పీఠాధిపతి మచాలే బాబా అనారోగ్యానికి గురి అయిన విషయం తెలుసుకొని ఆదివారం పలువురు నాయకులతో కలిసి పరామర్శించారు. గాంధారి కామారెడ్డిలో కృష్ణ మందిరాల పీఠాధిపతి అయిన బాబా నడుము నొప్పితో ఇబ్బంది పడుతూ, హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గత 15 రోజులుగా వైద్య చికిత్స పొందారు. స్వయంగా గాంధారి కృష్ణ మందిర్ కి వెళ్లి బాబాను పరామర్శించి యోగక్షేమాలు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తొందరగా ఆరోగ్యం కోలుకొని మళ్లీ దేవునికి పూజలు చేయాలని ఆకాంక్షించారు. పరమర్శించిన వారిలో ఉమ్మడి సదాశివనగర్ మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు, టిఆర్ఎస్ గాంధారి మండల అధ్యక్షులు వజిర్ శివాజీ రావు, రాష్ట్ర ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు, మాజీ డిసిఎంఎస్ డైరెక్టర్ వజీర్ ముకుందరావు, మాణిక్ రావు, నర్సింగ్ రావు, తదితరులున్నారు.