calender_icon.png 19 May, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘భూపతి చంద్ర ’స్మారక పురస్కారాల ప్రదానం అభినందనీయం

19-05-2025 12:00:00 AM

‘భూపతి చంద్ర’ స్మారక కథానికల పోటీ-2025 పురస్కారాల ప్రదానోత్సవ సభలో సీనియర్ సంపాదకుడు కే.రామచంద్రమూర్తి

ముషీరాబాద్, మే 18 (విజయ క్రాంతి) : భూపతి చంద్ర ’స్మారక పురస్కారాల ప్రదా నం అభినందనియం అని సీనియర్ సంపాదకులు కే.రామచంద్రమూర్తి అన్నారు. సాహిత్య చరిత్రలో ’కథానిక’ ప్రక్రియకున్న విశిష్టతను గుర్తించి తెలుగు కథానికకు మరింత ఉద్వేగభరితమైన ఉత్తేజాన్ని అందించాలని కథానికల పోటీని నిర్వహించాలని ట్రస్ట్ అధ్యక్షులు ఎంఎల్.కాంతారావు నిర్వహించిన ’భూపతి చంద్ర’ స్మారక కథానికల పోటి-2025 పురస్కారాల ప్రదానోత్సవ సభ ఆదివారం తెలంగాణ సారస్వత పరిషత్తుల్ నిర్వహించారు.

కె.రామచంద్రమూర్తి(సీనియర్ సంపాదకులు) ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా పాల్గొనగా, ఆత్మీయ అతిథిగా బి.నరసింగరావు(సినీ దర్శకుడు, సాంస్కతిక ప్రతినిధి), గౌరవ అతిథిగా, ప్రొ.మన్నవ సత్యనారాయణ(పూర్వాధ్యక్షులు, తెలుగు శాఖ, నాగార్జున యూనివర్సిటి) పాల్గొన్నారు. సభా నిర్వహణ కార్యక్రమాన్ని సి.ఎ స్.రాంబాబు నిర్వహించారు.

ఈ సంధర్భంగా పోటీలో ఎంపిక చేసిన కథానికలకు ప్రథమ ద్వితీయ, తృతీయ బహుమతులను, ఐదు ప్రోత్సాహక బహుమతులను అందచేశారు. మణికొండ లక్ష్మీకాంతారావు తమ స్వాగతోపన్యాసంలో సంస్థ ద్వారా చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ తెలుగు కథానికకు మరింత ఉద్వేగభరితమైన ఉత్తేజాన్ని అందించాలనే ఒక బృహత్తర ఉద్దేశం తో కథానికల పోటీని నిర్వహించామని తెలిపారు.

ప్రతి సంవత్సరం ఈ అవార్డులు అందజేస్తామని తెలిపారు. అనంతరం చాగంటి ప్రసాద్(హైదరాబాద్) ’తీరని రుణం ’ప్రధమ బహుమతి గెలుచుకోగా, ద్వితీయ బహుమతి, ’అనుకోని జ్ అతిథి’(ఉప్పులూరి మధుపత్ర శైలజ), తృతీయ బహుమతి ’కర్రెకోడి’(కొండ మల్లారెడ్డి, సిద్దిపేట), ప్రోత్సాహక పురస్కారాలను సమీద (ఎం.శ్రీనివాసరావు), వెన్నెల రాగం(గొర్లివాని శ్రీనివాస్), సాగని పయనం(వాసవ దత్తరమణ), శారదా విజయం(ఎస్ గంగలక్ష్మి), ఏది ముఖ్యం(పప్పు శాంతాదేవి) లను అందజేశారు. అనంతరం వారిని శాలువతో సన్మానించారు.