11 July, 2026 | 6:29 PM

ఘనంగా ఎన్సీ సంతోష్ జన్మదిన వేడుకలు

11-07-2026 05:20 PM

ఎర్రవల్లి పాఠశాలకు ఎల్ఈడి టీవీ బహూకరణ 

గజ్వేల్: కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, బిఆర్ఎస్ నాయకులు ఎన్ సి సంతోష్ గుప్తా జన్మదిన వేడుకలు అభిమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ ఆర్ కాలనీ ఎర్రవల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిజిటల్ తరగతులు నిర్వహించడానికి ఎన్సీ సంతోష్ ఎల్ఈడి టీవీని విరాళంగా అందజేశారు. అలాగే గజ్వేల్ బార్ అసోసియేషన్ కు వాటర్ ఫ్రీజర్ ను బహుకరించారు. ఈ సందర్భంగా గజ్వేల్ కోర్టు జడ్జి ఎన్సీ సంతోష్ ను అభినందించారు. అలాగే పలు చోట్ల మొక్కలు నాటడంతో పాటు పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళితో పాటు ఎన్సీఆర్ యువసేన, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.