21-01-2026 12:00:00 AM
రూ. 8.15 లక్షల విలువ చేసే 262 మద్యం బాటిల్ స్వాధీనం
ఇద్దరిపై కేసు నమోదు.. మద్యాన్ని తరలిస్తున్న ఆటో సీజ్
సికింద్రాబాద్ జనవరి 20 (విజయక్రాంతి): రూపాయలు లక్షల లక్షలు ఖర్చు చేసే ఫంక్షన్లు చేస్తారు. వచ్చిన అతిథులకు తాము ఏంటో చూపించుకోవడానికి మ ద్యం విందు కూడా ఏర్పాటు చేస్తారు.కానీ తక్కువ ధరల వచ్చిన మద్యాన్ని పెట్టి ఎక్సైజ్ శాఖ కళ్ళు కప్పే ప్రయత్నాలు చేసి,ఎక్సైజ్ శాఖకు పట్టుబడి ఉన్న పరువును కాస్త పలుచన చేసుకొని సంఘటన సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిం ది. వివరాల్లోకి వెళితే.సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని సిక్కు విలేజ్ లో ఇంపీరియల్ గార్డెన్‌లో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశారు.
వచ్చిన అతిథులందరికీ మద్యంతో విం దు ఇవ్వడానికి అవసరమైన మందును తెలంగాణ మద్యం కాకుండా (ఎన్డి పిఎల్) నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తక్కువ ధరలకు వస్తుందని కొనుగోలు చేసి ఫంక్షన్ను నిర్వహిస్తుండగా సోమవారం రాత్రి సికింద్రాబాద్ ఎక్సైజ్ సీఐ జగన్మోహన్ రెడ్డి సిబ్బందితో కలిసి దాడి నిర్వహించి 261 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని తీసుకువచ్చిన ఆటో ట్రాలీతో పాటు పాడేరు శ్రీధర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫంక్షన్ నిర్వహణకు సంబంధించిన వ్యక్తి శ్యామ్ జోసెఫ్ అనే అతనిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పట్టుకున్న మద్యం బాటిల్లో 44 ఏర్పోర్ట్ నుంచి తెచ్చిన డ్యూటీ ఫ్రీ మధ్యం 23 మద్యం బాటిళ్లు గోవా నుంచి తెచ్చిన టువంటివి 191 మద్యం బాలి బాటిల్స్ డిఫెన్స్ కు సంబంధించిన స్వాధీ నం చేసుకున్నారు. మొత్తం మద్యం బాటిల్లో రెండే రెండు తెలంగాణకు చెందినటువంటి మద్యం బాటిల్ ఉండడం కోసమేరుపు.పట్టుకున్న మద్యం విలువ రూపాయలు 8.15 లక్షలు గా ఉంటుందని అంచనా వేశారు. ఈ దాడిలో సీఐతో పాటు ఎస్‌ఐ దామోదర్, కానిస్టేబుల్స్ నాగరాజు,ప్రసాద్ రవి తదితరులు ఉన్నారు.