29 August, 2026 | 12:31 PM

Breaking News

ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •   బీచుపల్లి వద్ద ఎన్‌హెచ్-44పై రోడ్డుప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం   •   పెద్దమ్మ గుడిలో విషాదం.. ప్రాణం తీసిన కొత్త కారు   •   గుండెపోటుతో రంగాపూర్ సర్పంచ్ గోవు అంజమ్మ మృతి   •  

పురుగు మందులపై న్యాయపోరాటం

19-06-2026 12:29 AM

కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. ఈ చిత్రానికి చెట్టన్ డీకే దర్శకత్వం వహించగా, సాగర్ బీ షిండే కథ, స్క్రీన్‌ప్లే అందించి నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్, ఎంఐ జీ ప్రొడక్షన్, స్టూడియో స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన తొలి అధికారిక పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఈ సందర్భంగా దర్శకుడు చెట్టన్ డీకే మాట్లాడుతూ.. “ఆహార కల్తీ కారణంగా కుటుంబ సభ్యులు, ఆత్మీయులను కోల్పోయిన ప్రతి భారతీయుడి కథే ‘ది ఇండియా స్టోరీ’. మన సమాజంలో అత్యంత తీవ్రమైన సమస్యల్లో ఆహార కల్తీ ఒకటి. అందరి రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే ఈ అంశానికి సంబంధించి వాస్తవాన్ని ప్రజల ముందుకు తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశం” అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిశాంత్ భాగవత్; సంగీతం: మంగేశ్ ధాక్డే; ఎడిటింగ్: ఆశిష్ మ్హాత్రే; సాహిత్యం: షకీల్ అజామీ.