18 August, 2026 | 1:46 AM

వాహనం ఢీకొని చిరుత కూన మృతి

18-08-2026 12:40 AM

నిబంధనల మేరకు దహనం

అచ్చంపేట, ఆగస్టు 17  నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మన్ననూర్‌శ్రీశైలం జాతీయ రహదారి765పై రోడ్డు ప్రమాదంలో చిరుత కూన మృతి చెందింది. మన్ననూర్ రేంజ్లోని గుండంఈ బీట్ కంపార్ట్మెంట్ నంబర్ 331 వద్ద అటవీ సిబ్బంది గస్తీలో మృతదేహాన్ని గుర్తించారు.రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావించారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సోమవారం జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్ర, అమ్రాబాద్ వెటర్నరీ డాక్టర్ వి.రాజు ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి అటవీశాఖ నిబంధనల ప్రకారం దహనం చేశారు. చర్మం, గోర్లు, దంతాలు తదితర అవయవాలు అక్రమంగా వినియోగించబడకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.కార్యక్రమంలో ఎఫ్డీవో యశ్ చంద్ర ప్రకాశ్ సింఘాల్, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.