17 April, 2026 | 10:08 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

సమిష్టి కృషితో విగ్రహాలు ఏర్పాటు చేసుకుందాం

23-04-2025 05:40 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో బీసీ నాయకులంతా సమిష్టి కృషితో బీసీ సామాజిక స్ఫూర్తి దాతల విగ్రహాలను ఏర్పాటు చేసుకుందామని ఐక్యవేదిక నాయకులు తీర్మానం చేశారు. పట్టణంలోని పెన్షనర్ల భవనంలో బీసీ ఐక్యవేదిక సమావేశం నిర్వహించి నిర్మల్ జిల్లా కేంద్రంలో బీసీ భవన నిర్మాణంతో పాటు మహానీయులైన మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి విగ్రహాలను ఏర్పాటు చేయాల్సినందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.

బీసీల్లో ఐక్యత సాధించి హక్కుల కోసం అందరం కూడా పోరాడాలని వారు పేర్కొన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకోగా ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గా ఎంసీ లింగన్న ప్రధాన కార్యదర్శిగా అమరవీని నర్సాపూర్ సహాయ కార్యదర్శిగా అనుముల భాస్కర్ కార్యనిర్వక అధ్యక్షుడిగా మనోజ్ యాదవ్ కోశాధికారిగా భూసారపు గంగాధర్ తో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.