calender_icon.png 9 July, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా హక్కులు కాలరాస్తే ఊరుకోం

08-08-2024 12:03:23 AM

  1. రైతు ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమం
  2. అమృత్‌సర్ జాతీయ మహాసభలో బీసీ నేతల హెచ్చరిక 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీల ను ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు విస్మరిస్తే దేశంలోని బీసీలను ఏకం చేసి రైతుఉద్యమ తరహాలో బీసీ ఉద్యమాన్ని చేపడతామని బీసీ నేతలు హెచ్చరించారు. మండల కమిషన్ సిఫార్సుల అమలు కోసం మరో మహా మండల్ ఉద్యమాన్ని నిర్మించాలని, ఇందుకోసం పార్టీలను, జెండాలను పక్కన పెట్టి ఓబీసీలంతా ఐక్యం కావాలని ఓబీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

బుధవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన అఖిల భారత జాతీయ 9వ మహాసభను గురునానక్‌దేవ్ యూనివర్సిటీలో నిర్వహించారు. బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ బాబాన్‌రావ్ తైవాడే నేతృత్వంలో జరిగిన మహాసభకు 18 రాష్ట్రాల ప్రతినిధులు, జాతీ య బీసీ కమిషన్ చైర్మన్, వివిధ రాజకీయ పార్టీల పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సామాజిక ఉద్యమ సంఘాల నేతలు హాజరయ్యారు.

జాతీ య బీసీ కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగారం అహిర్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్, బీజేపీ, పార్లమెంట్ సభ్యులు ప్రతిభా సురేష్, జాన్కర్ దాన్కర్, రాందేవ్ కిసాన్,  మాజీ మంత్రి  మహాదేవ్ జాన్కర్ పాల్గొని ప్రసంగించారు. బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మండల కమిషన్ సిఫారసులు అమలు చేయాలని 40 ఏళ్లుగా పోరాడుతున్న ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు.

జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ పెంచడానికి కులగణన చేపట్టకపోవడం దారుణమన్నారు. మహిళ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట కల్పించకుండా, కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయకుండా, కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు కేంద్రం అన్యా యం చేస్తుందని మండిపడ్డారు. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగారం మాట్లాడుతూ.. ఓబీసీల హక్కులు నేరవేరాలంటే పార్టీల కతీతంగా ఐక్యం కావాలన్నారు.

బీసీల క్రిమిలేయర్ విషయంలో ఆదాయ పరిమితిని పెంచడా నికి కమిషన్ పరిశీలిస్తుందని, ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించిందని, త్వరలోనే బీసీ కమిషన్ ఒక నివేదిక సమర్పిస్తుందన్నారు. మహాసభలో బీజీ సంఘాల ప్రతినిధులు కేసన శంకర్‌రావు, బైరి రవికృష్ణ, ఇంద్రజిత్‌సింగ్, రాజేశ్ షైన్, సచిన్ రాజోల్కర్, ఓబీసీ సంఘాల నేతలు గణేశ్‌చారి, బాలరాజ్‌గౌడ్, విక్రమ్‌గౌడ్, మణిమంజరి, రమ తదితరులు పాల్గొన్నారు. 

మహాసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన కొన్ని అంశాలు

  1. మండల కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమ లు చేయాలి. జనాభాకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి. 
  2. దేశవ్యాప్తంగా జరిగే జాతీయ జనగణనలో బీసీ కులగణన చేపట్టాలి. 
  3. చట్ట సభలలో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి. బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాలి.
  4. కేంద్రస్థాయిలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రి మండలి ఏర్పాటు చేయాలి. బడ్జెట్‌లో ఓబీసీల సంక్షేమానికి ఏటా లక్ష కోట్లు కేటాయించాలి. 
  5. హైకోర్టు, సుప్రీం న్యాయమూర్తుల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కల్పించాలి.