08-08-2024 12:05:54 AM
చేనేత, జౌళీ శాఖ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో ఎక్స్‌పో
ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక అవార్డులు ప్రదానం
16 వరకూ కొనసాగనున్న హ్యాండ్‌లూమ్ ఎగ్జిబిషన్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): మన దేశ పురాతన, సాంస్కృతిక, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న చేనేత కళలకు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పథకాలను రూపొందిచనున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చేనేత, జౌళీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజా లో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను ముఖ్య అథిగా హజరైన మంత్రి తుమ్మల బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షే మం కోసం కట్టుబడి ఉందన్నారు. నేతన్నల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. నేతన్నల సృజనాత్మకత దేశానికే గర్వ కారణమన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ధరించి నేతన్నలకు చేయూత ఇవ్వాలన్నారు. ప్రపంచస్థాయిలో పోటీ పడే పద్ధతులను నేర్చుకుని నేత ఉత్పత్తులను తయారు చేయాలని సూచించారు. నేతన్నకు చేయూత పథకం కింద 2024 లో 36,133 కార్మికులకు లబ్ధి చేకూర్చేందుకు బడ్జెట్‌లో రూ.90 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. 36,777 మంది చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులకు బీమాకు రూ. 15 కోట్లు కేటాయించామన్నా రు.
రాష్ట్రంలో ఇండియన్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) నెలకొల్పడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు వెల్ల డించారు. ఇప్పటివరకు నేతన్న బీమా పథకం కింద 124 మంది క్లెయిమ్స్‌కు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున రూ.6.20 కోట్లను నామినీ ఖాతాలకు జమ చేశామన్నారు. అనంతరం రాష్ట్రంలో చేనేత డిజైనర్లలో ప్రతిభ కనబర్చిన 32 మందికి ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు పురస్కారం, ప్రతిభా పత్రం, జ్ఞాపిక, శాలువాతో చేనేత కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో చేనేత జౌళీ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, అసిస్టెంట్ డైరెక్టర్లు వెంకటేశం, ఇందుమతి, టిస్కో అధికా రులు అశోక్‌రావు, రఘునందన్‌రావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్ విజయారెడ్డి, మాజీ డీఐజీ తేజ్‌దీప్‌కౌర్, రా్రష్ట్ర పద్మశాలీ సంఘం అధ్యక్షులు కందకట్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.
పురస్కారాలు పొందిన ఉత్తమ చేనేత కళాకారులు
సిద్దిపేట: బుగ్గ శ్రీరాములు, సిరిగాది లక్ష్మ య్య, కరీంనగర్: గుర్రం ఆంజనేయులు, ఎలిగేటి ఉపేందర్, రంగారెడ్డి: చెరుపల్లి ప్రకాశ్, కోరే గంగ, పొడమల్ల రంగయ్య, యాదాద్రి భువనగిరి: గడ్డం బాలయ్య, తిరందాస్ సంతోష్‌కుమార్, ఎన్నం మాధ వి, పున్నా సత్యనారాయణ, కందగట్ల ఆదినారాయణ, నారాయణపేట: కందూరి శ్రీనివాస్, కత్రి ప్రమీల, మహబూబ్‌నగర్: డీ రమేశ్, జనగాం: రచ్చ కృష్ణమూర్తి, పాము భిక్షపతి, ఆడె పు శ్రీనివాస్, సామల సదానందం, జయశంకర్ భూపాలపల్లి: గోరంట్ల శ్రీనివాస్, జోగులాంబ గద్వాల: భావండ్ల వెంకటేశ్, మునెప్ప, వనపర్తి: పెరుమాళ్ల సత్యన్న, చిన్ని సీతారాములు, గాజుల వెంకటేశ్, నల్గొండ: చిలుకూరి ధనుంజయ, సర్కాల సత్యనారాయణ, కర్నాటి యాదయ్య, కర్నాటి శ్రీనివాస్, చెరుపల్లి వెంకటేశ్, కర్నాటి కృష్ణయ్య