19 June, 2026 | 2:24 AM

విహారం.. కావొద్దు విషాదం

19-06-2026 01:01 AM
  1. బోట్ సరదా ప్రాణాలకే ముప్పు 
  2. ఇంజన్ బోట్‌పై లైఫ్ జాకెట్ లేకుండా పరిమితికి మించి ప్రయాణం 
  3. అనుమతులు లేకుండా కృష్ణా నదిలో ఇంజన్ బోటింగ్ 
  4. అధికారుల కనుసన్నల్లో ఇంజన్ బోటింగ్ 

పాలకవీడు, జూన్ 18: పాలకవీడు మండలం మహంకాళిగూడెం వద్ద ఉన్న కృష్ణానదిలో ఇష్టానుసారంగా ఇంజిన్ బోటు న డుపుతూ   ప్రయాణీకుల తరలింపును  ఎ టువంటి భద్రతలు పాటించకుండా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు.ప్రతీ శుక్రవారం, ఆదివారం దర్గాకు వచ్చే భక్తులు సరదాగా కాసేపు కృష్ణానదిలో బోటు ప్రయాణం చేయాలని ఉంటుంది.ఆ సరదానే అనుకోని సంఘటనలు జరిగితే తీరని దుఃఖం మిగిల్చే ప్రమాదం ఉంది.

నిర్వాహకులు డబ్బుల సం పాదనపైనే దృష్టి ఉంది కానీ బోటు ప్రయాణికులకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవ డం లేదని అంటున్నారు.అధికారులు కూడా ఎటువంటి పర్యవేక్షణలు లేకపోవడంతో ఇష్టానురాజ్యంగా మారింది.నిర్వాహకులు సామర్థ్యానికి మించి ప్రయాణికులను పడవలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై అధికారులు ఎవ రూ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఈ ప్రదేశంలో గతంలో అనేక ప్ర మాదాలు సంభవించి యువత ప్రాణాలు కోల్పోవడం అందరికీ తెలిసిందే.అయినప్పటికీ కాలం చెల్లిన,నైపుణ్యం లేని ఇంజిన్ బో ట్లపై ప్రయాణికులు భయంభయంగా ప్ర యాణం కొనసాగిస్తున్నారని స్థానికులు చె బుతున్నారు.పడవలో ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.

కాబట్టి మీకు ఈత బాగా వచ్చినా కూడా లైఫ్ జాకెట్ ధరించడం చాలా అవసరం.ఎందుకంటే ప్రమాద సమ యంలో ఈత కొట్టడం కష్టమవుతుం ది. లైఫ్ జాకెట్ ఉంటే  సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది.అంతే కాకుండా లైఫ్ జాకెట్ సరిగ్గా వేసుకున్నామా లేదా అని కూ డా తప్పక చెక్ చేసుకోవాలి.

సరదా చాటున పొంచి ఉన్న ప్రమాదం 

   ప్రభుత్వ అనుమతి లేకపోయినప్పటికి నిబంధనలకు విరుద్ధంగా కొందరు నాయకులు అధికారుల కనుసన్నల్లో అనధికార ప్రయాణానికి పచ్చజెండా ఊపడంతో నిర్వాహకులకు కాసుల పంట పండుతోందనీ స్థా నికులు ఆరోపిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో ఎ ప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అర్థం కా ని పరిస్థితి నెలకొంది.వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి

అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదు.ఎలాంటి అనుమతులు, సేఫ్టీ లేకుండా బోట్ నిర్వహి స్తున్నారు.ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకొ ని పుష్కర ఘాట్‌కు జానపహాడ్ దర్గా నుండి వచ్చే భక్తులకు భద్రత కలిపించాలి.

ఎన్.రమేష్

డీవైఎఫ్‌ఐ మండల కార్యదర్శి,

మహంకాలిగూడెం