19 June, 2026 | 3:23 AM

కల్వకుంట్ల కుటుంబానికి కడుపుమంట

19-06-2026 02:22 AM
  1. పేదలకు కార్పొరేట్ విద్యను ఓర్వలేకపోతుంది
  2. ఫిషరీశ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ 

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): నిరుపేద కుటుంబాలకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ వరంగా మారుతుంటే, వారికి కార్పొరేట్ విద్య అందుతోంటే కల్వకుంట్ల కుటుంబానికి కడుపులో మండు తోందని ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయికుమార్ మండిపడ్డారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థా యి విద్యను అందించాలనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేశారని తెలిపారు. నిరుపేద కుటుంబాల శాపం బీఆర్‌ఎస్ పార్టీకి తగిలిందన్నారు.

గురువారం ఆ యన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి నిరుపేద కుటుంబాల ఆశీర్వాదం ఉం దని, ఇంకా పదేళ్లు సీఎంగా ఉంటారని తెలిపారు. ఎన్ని ముచ్చట్లు చెప్పినా బీఆర్‌ఎస్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభంతో కేసీఆర్ ఫామ్ హౌస్‌కు, హరీశ్‌రావు రెస్ట్ హౌస్‌కు, కేటీఆర్ గెస్ట్ హౌస్‌కు శాశ్వతంగా పరిమితం కాబోతున్నారని మెట్టు సా యి ఆరోపించారు.