11 March, 2026 | 1:51 AM

తాతలనాటి భూములకు పట్టాలివ్వండి

11-03-2026 12:25 AM

తహసీల్దార్‌కు రైతుల విన్నపం

మొయినాబాద్, మార్చి 10 (విజయ క్రాంతి):తమ పూర్వీకుల కాలం నుండి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ చిలుకూరు గ్రామానికి చెందిన రైతులు మంగళవారం మొయినాబాద్ తహసీల్దార్ గౌతమకుమార్కు వినతిపత్రం అందజేశారు. చిలుకూ రు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 786లో ఉన్న 31 ఎకరాల భూమిని తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని రైతులు తెలిపారు. గతంలో 31 కుటుంబాలు సాగు చేయగా, ప్రస్తుతం ఆ సంఖ్య 100 కుటుంబాలకు చేరిందని, వారంతా ఈ భూమిపైనే ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు.

సాగులో ఉన్న తమకు చట్టబద్ధ మైన హక్కు పత్రాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే పట్టాలి ప్పించి న్యాయం చేయాలని తహసీల్దార్ను కోరారు. తాతల కాలం నుంచి మేము ఈ భూమిని నమ్ముకుని బతుకుతున్నాం. మా కు హక్కు పత్రాలు ఇస్తేనే మా బతుకులకు భరోసా ఉంటుంది. రైతుల విజ్ఞ ప్తి చేశారు. కార్యక్రమంలో చిలుకూరు మాజీ సర్పంచ్ సంగి మల్లేష్, నాయకులు జయవంత్, మధురాజు, రైతులు పాల్గొన్నారు.