3 June, 2026 | 1:47 AM

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేద్దాం

03-06-2026 12:00 AM

ఎమ్మెల్యే బీఎల్‌ఆర్ 

మిర్యాలగూడ, జూన్ 2: తెలంగాణ ప్రజ ల ఆకాంక్షల మేరకు సాధించుకున్న స్వరాష్ట్రం తెలంగాణ అభివృద్ధిలో సకల జనుల సమ్మెస్పూర్తితో రైతులు, యువత, కార్మికులు, మహిళల భాగస్వామ్యంతో సమగ్రా భివృద్ధికి కృషి చేద్దామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి( బిఎల్‌ఆర్) అన్నారు.

మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా సక లజనులతో కలిసి అహింసా మూర్తి మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిబాపూలే ల నూతన విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేర కే కాంగ్రెస్ ప్రజాపాలన అందిస్తుందన్నారు. గాంధీజీ బోధించిన అహింస అం బేద్కర్ అందించిన సామాజిక సమానత్వం పూలే ఆశించిన భోజన విద్యా వికాసాల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తుందన్నారు.

అనంతరం బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అడ్వాన్స్ జేఈఈ ఫలితాల్లో 32వ ర్యాంకు సాధించిన గిరిజన విద్యార్థి కృష్ణ ప్రసాద్ కు 50,000, గౌడ సంఘం భవన నిర్మాణానికి 10 లక్షలు, ఎల్‌ఐసి ఏజెంట్ అసోసియేషన్ భవన నిర్మా ణానికి 6 లక్షలు, జప్తివీరప్పగూడెం  రామాలయ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల విలువ గల  చెక్కులు అందజేశారు. అంతకుముందు ఎన్టీఆర్ కాంప్లెక్స్ నందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ భారతిరాగ్యా నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలు, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ జాడీ రాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి,గాయ ఉపేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తల కొప్పుల సైదులు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్య క్షుడు మాడుగుల శ్రీనివాస్, దిలావర్పూర్ సర్పంచ్ బెజ్జం సాయి, దళిత బహుజన సం క్షేమ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సం స్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.