3 June, 2026 | 1:47 AM

కేసులకు భయపడేది లేదు

03-06-2026 12:00 AM

పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి 

బైంసా జూన్ 2 (విజయ క్రాంతి): పోలీసులు కేసులు నమోదు, విచారణలో నిష్పక్ష పాతంగా వ్యవహరించాలని ఎంఐఎం నాయకుడు బైంసా మున్సిపల్ మాజీ చైర్మన్ జాబిర్ అహ్మద్ అన్నారు.  తమ నివాసంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారూ . పట్టణంలో వివిధ కేసుల నమోదు విచారణలో , బెట్టింగ్ కేసుల్లో నిందితుల అరెస్టుల్లో నెలల తరబడి జాప్యం చేసే పోలీసులు ము న్సిపల్ సమావేశంలో చోటు చేసుకున్న వాగ్వాదం లో తమ పార్టీ కౌన్సిలర్ల పై అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని విమర్శించా రు.

తాము కేసులకు భయపడమని, పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని అన్నా రు. తమపై అనవసరంగా కేసులు పెడితే చట్టపరంగా ఇలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్నారు. పట్టణంలో శాంతిభద్రతలకు కాపాడేందుకు తాము పోలీసులకు అన్ని విధాల సహకరిస్తామని అదే సందర్భంలో తమపై అనవసరంగా కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తే న్యాయబద్ధంగా తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ పాలకవర్గానికి పట్టణ పరిపాలన పై చిత్తశుద్ధి, అవగాహన లేదని ఆరోపించారు.

సమావేశాల్లో ప్రజల సమస్యలపై తాము ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రస్తావిస్తామని అందులో రాజీలేదన్నారు. అయితే పాలకవర్గ సభ్యులు తమను అడ్డుకుంటున్నారని ఈ విషయమై సమావేశాల్లో వాగ్వాదం సహజమన్నారు. పాలకవర్గ సభ్యులు తమను రెచ్చగొడుతూ వివాదాలకు ఆజ్యంపోస్తున్నారని విమర్శించారు. తమ హాయంలో పట్టణంలో కుల మతాల కు అతీతంగా పండగలు ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుత పాలకవర్గం పూర్తిగ విఫలమవుతుందన్నారు.

కనీసం పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వీధి దీపాలు ఏర్పాటు అయిన సక్రమంగా నిర్వహించాలని హితవు పలికారు. పట్టణ అభివృద్ధికి తాము అన్ని విధాల సహకరిస్తామని అన్నారు. మున్సిపల్ సమావేశాల్లో తమ వార్డు సమస్యలను ప్రస్తావించినప్పుడు పాలకవర్గ సభ్యులు అనవసరంగా జోక్యం తగదన్నారు. అలా అడ్డుకుంటే తాము తగు రీతిలో జవాబు చెప్పేందుకు అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. సమావేశంలో ఎంఐఎం వార్డు సభ్యులు నాయకులు పాల్గొన్నారు.