ఎన్నో పోరాటాల ఫలితమే తెలంగాణ
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ఆలేరు, జూన్ 2 : త్యాగాలు పోరాటాల నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అనేకమంది అమరవీరుల ప్రాణత్యాగ ఫలితంగానే నేడు మనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ప్రజల ఆకాంక్షల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే అభివృద్ధి, సంక్షేమం, సుస్థిర ప్రగతికి ప్రతీకగా నిలిచిందన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాల సాధనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందన్నారు.
రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ఈ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్ శ్రీ వాణి, న్యాయమూర్తులు, అధికారులు, ప్రజాసంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






