21 July, 2026 | 11:08 AM

సమర్థవంతంగా సమన్వయంతో పనిచేద్దాం

21-07-2026 12:00 AM
  1. సమష్టిగా రైతులు, ప్రజలను కాపాడుకుందాం
  2. ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించండి 
  3. కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి
  4. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ

మహబూబ్ నగర్ జూలై 20 (విజయ క్రాంతి) : వర్షం భావ పరిస్థితులను అధిగమించిందికు ఉమ్మడి జిల్లా రైతన్న సమర్థవంతంగా ఎదుర్కునేలా ప్రత్యమ్నయ పంటల వైపు మళ్లించాల్సిన అవసరం  ఎంతైనా ఉందని  ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజల ప్రయోజనాల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రకృతి విపత్తులను ముందుగానే అంచనా వేసి, వాటి ప్రభావాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని తెలిపారు.

సోమవారం మహబూబ్నగర్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై, ఇతర అభివృద్ధి కార్యకలాపాలపై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ  తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్, పశుసంవర్ధకం సహా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

జూలై 31 నాటికి శాఖల వారీ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అన్ని శాఖలు యుద్ధ యుద్ధప్రాతిపదికన పనులు చేయాలని ఆదేశించారు.ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని స్పష్టం చేశారు.రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ కలెక్టరేటులో సోమవారం నిర్వహించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎల్నినో కంటింజెన్సీ సమీక్ష సమావేశంలో మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల పరిస్థితులను శాఖల వారీగా మంత్రి సమీక్షించారు.

ఎల్నినో అంటే ఏమిటి, దాని ప్రభావం ప్రజల జీవితాలపై, వ్యవసాయంపై ఎలా ఉంటుందో గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల్లో అనవసర ఆందోళన కలగకుండా శాస్త్రీయ సమాచారం అందించాలని సూచించారు.ఉమ్మడి జిల్లాలోని 5 జిల్లాలకు సంబంధించి ఈ నెల 24 న నాగర్కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల అధికారులతో సమీక్షా, మధ్యాహ్నం 2 గంటలకు  మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో మహబూబ్నగర్, నారాయణపేట,

జోగులాంబ గద్వాల జిల్లాల అధికారులతో మరో సమీక్ష నిర్వహించి జిల్లాల వారీగా కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు.శాఖల వారీగా  ప్రస్తుత పరిస్థితులను, భవిష్యత్ కార్యాచరణను అధికారులు మంత్రికి వివరించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాధారణంగా ఈ సమయానికి నమోదు కావాల్సిన వర్షపాతంతో పోలిస్తే సుమారు 40 శాతం  లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు.

పోడు వ్యవసాయంపైనే ఆధారం డాక్టర్ వంశీకృష్ణ, అచ్చంపేట ఎమ్మెల్యే 

నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలు చెంచు గిరిజనులు అధికంగా నివసించే ప్రాంతాలని, ఈ ప్రాంత ప్రజల జీవనాధారం ప్రధానంగా పోడు వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. సుమారు 7 వేల ఎకరాల పోడు భూముల్లో చెంచు రైతులు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారని,ఉద్యాన పంటలు ప్రోత్సహించాలంటే ప్రతి జిల్లా కేంద్రంలో  విధిగా కోల్ స్టోరేజీలు నిర్మించాలని, ప్రభుత్వం ఆ విధమైన చర్యలు తీసుకుంటే ప్రజలు రైతులకు ఉద్యాన పంటలపై నమ్మకం కలుగుతుంది. 

పూర్తి సమాచారం రైతులకు అందించాలి : డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే

గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించే, అధిక అన్నిటితో సాగు చేసే పంటలను సాగు చేయకుండా ముందస్తుగానే రైతులకు అవగాహన కల్పించాలి. ప్రతి అధికారి విధిగా గ్రామస్థాయిలో రైతాంగానికి స్పష్టంగా తెలియపరచాలి. 

  1. రైతులకు నష్టం లేకుండా చూడాలి
  2. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గం లో దాదాపు 60 కిలోమీటర్లు నీటి ప్రవాహం ద్వారా ప్రజలకు చేరాలని, ఆశించిన స్థాయిలో కాలువల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో రైతుల పొలాల్లోకి నీటి ప్రవాహం ద్వారా రైతాంగం నష్టం పోతున్నారని, ప్రస్తుత వర్షాభావ ప్రభావ నేపథ్యంలో క్రాఫ్ట్ హాలిడే నిర్వహించి, సాగునీటి ప్రాజెక్టుల కాలువల పెండింగ్ పనులు పూర్తిచేసి రైతాంగానికి మేలు చేయాలి. 

సాధారణం కంటే వర్షం గణనీయంగా తగ్గింది :  మధుసూదన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే

దక్షిణ తెలంగాణలో సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గిందని, ఈ పరిస్థితుల్లో రైతులు ఇప్పటికీ సాధారణ వర్షాలు వస్తాయని ఆశిస్తూ సంప్రదాయ పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు రైతు వేదికలు, గ్రామస్థాయి సమావేశాల ద్వారా ఎల్నినో ప్రభావం, వర్షపాతం పరిస్థితులు, ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యామ్నాయ చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.  గ్రౌండ్ వాటర్ నివేదికలను గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాల్లో తప్పనిసరిగా వివరించాలని అధికారులను ఆదేశించారు.

తాగునీటి సరఫరా లోను ఇబ్బందులు :  జనంపల్లి అనిరుద్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే

జడ్చర్ల మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటి పంపిణీలో గత రెండేళ్లుగా తీవ్ర సమస్యలు కొనసాగుతున్నాయి. తాగునీటి సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రత్యేకించి వేసవి కాలంతో పాటు ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సమస్య మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారులు సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, అవసరమైతే అదనపు నీటి వనరులను సమకూర్చి నిరంతరాయంగా తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి :  బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే 

ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగు చేయగల పొద్దుతిరుగుడ పంటను ప్రోత్సహించాలని సూచించారు. రైతులు ఈ పంట సాగు చేయడానికి ముందుకు వచ్చేలా అవసరమైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి. వరి సాగు చేయాల్సిన పరిస్థితుల్లో సంప్రదాయ నీటి ఆధారిత సాగుకు బదులుగా డ్రై ప్యాడీ  పద్ధతులను అనుసరించేలా రైతులకు అవగాహన కల్పించాలి. ఈ కార్యక్రమంలో సమావేశంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, ఎల్నినో ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ జి. చిన్నారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ షఫీ ఉల్లా, ఉమ్మడి జిల్లా శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి మధుసూధన్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి,కూచుకుళ్ళ రాజేశ్ రెడ్డి, తూడి మేఘా రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, విజయుడు,

ఇతర ప్రజాప్రతినిధులు, ఐదు జిల్లాల కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, ఆదర్శ్ సురభి, సి హెచ్ ప్రియాంక, షేక్ రిజ్వాన్ భాషా, హేమంత్ కేశవ్ పాటిల్,రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివ సేనా రెడ్డి,రాష్ట్ర గొర్రెలు,మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ సరిత, మహబూబ్ నగర్ నగర పాలక సంస్థ మేయర్ జి.మమత,ఉమ్మడి జిల్లా మున్సిపల్ చైర్మన్ అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.