21 July, 2026 | 11:08 AM

మెట్ట పంటలే మేలు

21-07-2026 12:00 AM
  1. రాష్ట్రంలో అత్యధికంగా ఎల్ నీనో ప్రభావం
  2. ఎదుర్కొనేందుకుసిద్ధంగా ఉండాలి 
  3. అధికారులు సమన్వయంతో పనిచేయాలి
  4. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  5. ఉమ్మడి నల్లగొండ జిల్లాపై సమీక్ష సమావేశం
  6. హాజరైన మంత్రులు అడ్లూరి, కోమటిరెడ్డి

నల్లగొండ టౌన్, జూలై 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో అత్యధికంగా ఎల్ నీనో ప్రభావం ఉన్నందున రైతులు మెట్ట పంటల సాగు వైపు మొగ్గు చూపాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఎల్ నినోను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయా లని ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో తాగునీరు, విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా, వ్యవసాయ సాగులో ఇబ్బందులు పడకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై ఉందని అన్నారు.

సోమవారం నల్లగొండ కలెక్టర్‌లో ఎల్ నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, ఇతర అంశాలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు అన్నింటికి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు.

రాబోయే పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు అన్ని రకాలుగా ప్రజలకు అండగా నిలబడాలని, రైతులు పంటల మార్పిడి, ఆరుతడి పంటల వైపు వెళ్లేలా అవగాహన కల్పించాలని, ప్రస్తుతం వేసుకున్న పంటలు కాపాడేందుకు ప్రయత్నించాలని ఆదేశించారు. వర్షపాతంపై ఎప్పటి కప్పుడు ప్రజలను, రైతులను అప్రమత్తం చేసి నష్టపోకుండా చూడాలని సూచించారు. భూగ ర్భజల, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ క్షేత్రస్థాయికి వెళ్లి అవగాహన కల్పించాలన్నారు.

ఇప్పటికే వరి వేసుకున్న రైతులను ఆదుకునే విధంగా చూడాలని, సాగునీటి కోసం ప్రత్యేకంగా బోర్లు వేయ కుండా నియంత్రించాలని, తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఎల్ నినో వల్ల అంతర్జాతీయ స్థాయిలో విపత్కర పరిణామాలు ఏర్పడతాయని, మన దేశంలో సూపర్ ఎల్ నినోగా నిపుణులు చెపుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టులలో నీరు లేకపో వడం, వర్షాలు తక్కువగా ఉన్న విషయాన్ని రైతులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. బోర్లు వేసుకున్నప్పటికీ నీరు వచ్చే అవకాశం లేనందున పంటలు వేసుకుని ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకురావద్దన్నారు. 

ప్రజలకు అండగా ప్రభుత్వం: కోమటిరెడ్డి 

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థి తులను ఎదుర్కోవడంలో అధికారులు క్షేత్రస్థా యిలో పర్యటిస్తూ జిల్లా ప్రజలకు అండగా నిలబడాలని కోరారు. కరువు పరిస్థితిలో ప్రభు త్వం ప్రజలకు అండగా ఉంటుందని, ఎస్‌ఎల్ బిసీ 600 మీటర్లు పూర్తయిందని, ఆగస్టు 2028 నాటికి ఎస్‌ఎల్బీసీ పూర్తయితే ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలమవుతుందని తెలిపారు.

తాగునీటిని దృష్టిలో ఉంచుకొని ఉదయ సముద్రంలో నీళ్లు నింపాలని, మూసి నుండి తిప్పర్తి మండలానికి సాగునీటిని వదలాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. దేవరకొండ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో తాగునీటి సమస్య గడిచిన మూడు నెలలుగా ఉన్నందున సమస్యను పరిష్కరించాలని, వెంట నే గ్రామాల ప్రజలకు తాగునీరు అందించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. 

సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మందుల సామేలు, కుందూరు జైవీర్‌రెడ్డి, పద్మావతిరెడ్డి, బాలు నాయక్, జగదీశ్వర్‌రెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, కోటిరెడ్డి, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, స్పెషలాఫీసర్, రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన సెక్రటరీ దాసరి హరిచందన, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్, అదనపు కలెక్టర్లు భాస్కరరావు, శ్రీనివాస్, ప్రేమ్‌కరణ్ రెడ్డి పాల్గొన్నారు.

వచ్చే జూలై వరకు తాగునీటి సమస్య!

ప్రస్తుతం ప్రాజెక్టులలో ఉన్న నీరు తాగునీటికి మాత్రమే సరిపోతుందనే విషయాన్ని రైతులు గమనించాలని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఈసారి వర్షాలు రాకుంటే వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి సమస్య ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రాజె క్టులో ప్రస్తుతం ఉన్న నీటిని దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటలకు వెళ్లాలని సూచించారు. తాగునీటికి సంబంధించి దేవరకొండ నియోజకవర్గంలో తాగునీరు అందించేందుకు లింకేజీ ఏర్పాటు చేయాలని, ఉమ్మడి జిల్లాలోని ఎస్‌ఎల్బీసీ, డిండితో పాటు, ఆయా నియోజకవర్గాలలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నింటిని ఈ హయాంలోనే పూర్తి చేస్తామని, దేవాదుల ఫేస్ -6 ద్వారా తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

డిండి ప్రాజెక్టు పనులు, దున్నపోతుల గండి, బస్వాపూర్ లను వేగ వంతం చేస్తామని మంత్రి తెలిపారు. ప్రత్యేకంగా కాలేశ్వరం ప్రాజెక్టుపై రూ పొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవ పరిస్థితులను సమా వేశానికి హాజరైన ప్రజా ప్రతినిధులు,  వివరించారు. వర్షాబావ పరిస్థితులను రైతులకు తెలియజేయాలని బోర్లు వేసి నష్టపోవద్దని తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగు చేసే మెట్ట సాగు పై దృష్టి సారించాలని మంత్రి లక్ష్మణ్ సూచించారు.