3 March, 2026 | 9:41 PM

శ్రీపాదరావు ఆశయాలను కొనసాగిద్దాం

03-03-2026 12:00 AM

కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్,మార్చి 2(విజయక్రాంతి): రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన దుద్దిళ్ల శ్రీపాదరావు ఆశయాలను కొనసాగిద్దామని కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని  కలెక్టరేట్ లో ఆసిఫాబాద్ ఆర్‌డిఓ లోకేశ్వర్ రావుతో కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించా రు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్‌గా, మం థని నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీపాదరావు రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని, రాజకీయాలలో అజాత శత్రువుగా, రాష్ట్ర ప్రజలకు అందించిన సేవలు  సదా స్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి కిరణ్, ఉద్యోగులు పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్  డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి ఆమె అర్జీలు స్వీకరించారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన రిజండర్లపై 48 గంటల్లో నివేదికలు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.