13 May, 2026 | 10:02 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి

03-03-2026 12:00 AM

మరిపెడ మార్చి 2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ లో మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 91వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావుచిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. 

పజలకు ఉపయోగపడే చర్చలన్నీ గౌరవ ప్రధంగా జరిగేలా చూశారని అన్నారు. తండ్రి స్ఫూర్తిని ఆయన కుమారుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ పరిశ్రమల శాసన వ్యవహారాల శాఖలను నిర్వహిస్తూ అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నారు. తండ్రి అందించిన విలువలు ప్రజల మధ్య ఉంటూ చేసే రాజకీయం ఆయన నడకలో పాలనలో ప్రతిబింబిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు జాటోత్ సురేష్ , బోడ భాస్కర్, మెరుగు రాము, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.