01-07-2025 12:27:36 AM
మాడ్గుల, జూన్ 30: నల్ల వారిపల్లి గ్రామపంచాయతీని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ సంపత్ కుమార్ అ న్నారు. సోమవారం గ్రామంలో ఎమ్మెల్యే నిధుల నుండి మంజూరైన రూ. 1.50 లక్షలతో కొనుగోలు చేసిన ఐమాక్స్ వీధి దీపా లను గ్రామస్తులతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నల్ల వారి పల్లి గ్రామానికి ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నారని ఆయన హా మీల మేరకు గ్రామానికి బీటీ రోడ్డు పనులు, సిసి రోడ్డు,అండర్ డ్రైనేజీ పనులను త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయ న పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు విజయరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు పెద్దయ్య,నాయకులు మల్లయ్య,, మల్లయ్య లు పాల్గొన్నారు.