calender_icon.png 1 July, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప స్వామి దేవాలయంలో చోరీ

01-07-2025 12:25:59 AM

- రూ. 2లక్షల విలువ గల పంచలోహ విగ్రహాలు అపహరణ

ఇబ్రహీంపట్నం, జూన్ 30:దేవాలయంలోని పంచలోహ విగ్రహాలు అపహరణకు గురైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జి ల్లా, ఇబ్రహీంపట్నం మండలం, రాచకొండ దండు మైలారం ప్రాంతంలో ఉన్న అయ్య ప్ప స్వామి దేవాలయంలో సుమారు 2లక్షల విలువ పంచలోహ విగ్రహాలు గుర్తు తెలియని దుండగులు దొంగిలించి ఉంటారని ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులుతెలిపారు.