11-02-2025 01:19:05 AM
* సీఎం రేవంత్‌రెడ్డికి మంద కృష్ణ మాదిగ లేఖ
* స్పందించిన సీఎం
* నేడు భేటీకి ఆహ్వానం
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణపై చర్చిం చేందుకు సమయం ఇవ్వాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సోమవారం లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయా న్ని స్వాగతిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.
జస్టిస్ షమీమ్ అక్తర్ కమి షన్ నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయని తెలిపారు. ఈ నివేదిక ప్రకారం దళిత కులాల హక్కులు, వాటా, వా రి అస్తిత్వం, భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. షమీమ్ కమిషన్ నివేదికపై చర్చించి కొన్ని వినతులు, సూచనలు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, లేఖపై సీఎం రేవం త్‌రెడ్డి స్పందించారు. మంగళవారం ఉదయం ౧౧ గంటలలోపు తనను వచ్చి మంద కృష్ణ మాదిగ కలవొ చ్చునని ప్రకటించారు.