21 April, 2026 | 6:30 PM

Breaking News

సబ్ స్టేషన్ నిర్మాణపు స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ జిల్లా అధికారి.   •   డ్యూటి కానిస్టేబుల్ పై దాడి   •   ప్రతి విద్యార్థి పది మందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలి   •   ఆందోళన చెందకండి.. ఆదుకుంటాం   •   ఇటుక బట్టిలో ట్రాక్టర్ బోల్తా.. కార్మికుడు మృతి   •   జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుడు నూతి జన్మదిన వేడుకలు   •   రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ   •   నా భూమికి రక్షణ కల్పించండి   •   గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత   •   బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •  

పండుగ నాడే కాదు ప్రతిరోజు బియ్యం తిందాం

02-04-2025 01:12 AM
  • దేశ చరిత్రలోనే పేదలందరికీ సన్నబియ్యం అందజేస్తున్న మన ప్రభుత్వం 

సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

మహబూబ్‌నగర్ ఏప్రిల్ 1 (విజయ క్రాంతి) : అందరం ఒకే రకమైన సన్న బియ్యం తిందామనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం పేదలందరికీ రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందజేయడం జరుగుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం భూత్పూర్ మండల కేంద్రంలోని తాటికొండ గ్రామంలో, భూత్పూర్ మున్సిపాలిటీలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం గతంలో పండుగరోజు మాత్రమే సన్న బియ్యం తినే రోజులు ఉండేవని ఎప్పుడు ప్రతిరోజు సన్న బియ్యం తినే రోజులు మన ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను క్రమం తప్పకుండా కట్టుకుంటూ ప్రజా ప్రభుత్వము ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుందని తెలిపారు. 

రాజాపూర్ మండల పరిధిలోని రాయపల్లి గ్రామంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు ఉన్నారు.